చిరుత చిక్కకపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో హై టెన్షన్!

శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత బోన్లకు చిక్కకపోవడంతో హై టెన్షన్ నెలకొంది.

Update: 2024-05-01 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత బోన్లకు చిక్కకపోవడంతో హై టెన్షన్ నెలకొంది. ఎయిర్ట్ పోర్ట్ పరిసరాల్లో 5 బోన్లలో ఐదు మేకలను ఉంచడంతో పాటు 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతను బంధించేందుకు గత నాలుగు రోజులుగా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిరుత కదలికల్ని అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. 5 చోట్లా బోన్లు ఉంచి అందులో మేకలను ఉంచారు అయితే చిరుత బోను వరకు వచ్చినా చిక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చిరుత బోను వరకు వచ్చి వెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాలకు చిక్కాయి. 


Similar News