కేసీఆర్ సర్కార్‌కు High Court లో చుక్కెదురు.. KTR ఇలాకలోనే..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మక విద్యుత్ సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) పాలకవర్గాన్ని రద్దు చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2022-08-25 12:19 GMT

దిశ,రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మక విద్యుత్ సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) పాలకవర్గాన్ని రద్దు చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదరైనట్లు అయ్యింది. సెస్ పాలకవర్గంను నామినేట్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 151 ను హైకోర్టు కొట్టివేయడంతో మంత్రి కేటీఆర్ ఇలాకాలో సెస్ పాలకవర్గం రద్దయ్యింది. సెస్ చైర్మన్‌గా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ నామినేట్ కాగా 2నెలల పాటు విధులు నిర్వహించారు. బోయినపల్లి మండలానికి చెందిన బీజేపీ నేత కనకయ్య ఈ నామినేట్ పాలకవర్గం చెల్లదని, ఎన్నికలు నిర్వహించాలని లేదా పాత పాలకవర్గాన్నే కొనసాగించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు పలుమార్లు విచారణ చేపట్టి గురువారం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని, అప్పటి వరకు జిల్లా కలెక్టర్‌ లేదా ఆ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెస్ పాలకవర్గం రద్దు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

Tags:    

Similar News