Breaking: చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది...

Update: 2024-01-12 14:35 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఆయన పౌరసత్వంపై ఇరువర్గాల వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది.

ఇక వాదనల సమయంలో చెన్నమనేని రమేశ్ 2018 ఎన్నికల సమయంలో జర్మనీ పౌరసత్వంతో పోటీ చేశారని సీనియర్ కౌన్సిల్ రవి కిరణ్ రావు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా అదే పౌరసత్వంతో ఇంకా ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల సందర్భంగా చెన్నమనేని రమేశ్ జర్మనీ పాస్ పోర్టుపై ప్రయాణం చేశారని వాదనలు వినిపించారు. 2019లో OCI కార్డుకు సైతం ఆయన దరఖాస్తు చేశారని, అది తీసుకునే సమయంలో చెన్నమనేని రమేశ్‌కి జర్మనీ పౌరత్వం ఉందని కోర్టుకు వివరించారు.

అటు చెన్నమనేని రమేశ్ జర్మనీ పాస్ పోర్టుతో రెండు సార్లు విదేశాలకు సైతం వెళ్లాడని కేంద్రం ఇచ్చిన నివేదికను పరిణగణనలోకి తీసుకోవాలని సీనియర్ కౌన్సిల్ రవి కిరణ్ రావు వాదనలు వినిపించారు. మరోవైపు చెన్నమనేని రమేశ్ విదేశీ ప్రయాణ వివరాలను అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టు సమర్పించారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Tags:    

Similar News