పోలీసులకు తన పేరు కృష్ణవేణిగా చెప్పిన హేమ..కారణం ఇదే!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి తన పేరు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు.

Update: 2024-05-23 07:48 GMT

దిశ,వెబ్‌డెస్క్: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అందులో 27 మంది మమిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ టెస్టుల్లో నటి హేమకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే హేమ గురించి మరో సంచలనం విషయం బయటపడింది. అది ఏంటంటే.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి తన పేరు బయటపడకుండా జాగ్రత్త పడ్డారంట. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. 

Similar News