తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురుస్తుంది. కుమ్రంభీం, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లోని మనూరు, కంది, నారాయణఖేడ్, నాగల్ గిద్ది, రేగోడ్, జగదేవ్ పూర్, ములుగు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

Update: 2023-06-04 12:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురుస్తుంది. కుమ్రంభీం, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లోని మనూరు, కంది, నారాయణఖేడ్, నాగల్ గిద్ది, రేగోడ్, జగదేవ్ పూర్, ములుగు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, సీఎం కేసీఆర్ పర్యటిస్తున్న నిర్మల్ జిల్లాలోను ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పటాన్ చెరు, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కాగా, రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News