మహానగరంలో వర్ష బీభత్సం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

జంటనగరాల్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి.

Update: 2023-09-05 04:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: జంటనగరాల్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ నీటిలోని చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు వలన నాలాలు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఇంటి ముందు పార్క్ చేసిన చాలా వాహనాలు కొట్టుకుపోగా.. నడుము లోతు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా కృష్ణ నగర్ లోని పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు వర్షానికి కొట్టుకుపోయాయి. అలాగే ఫతేనగర్ లోని ఓ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో అంబులెన్స్ ఆ నీటిలో సగం వరకు మునిగిపోయి అక్కడే ఆగిపోయింది. ఈ రోజు మొత్తం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలపడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలపై ఆరాతీస్తున్నారు.

Tags:    

Similar News