కాంగ్రెస్ సర్కారుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-12-13 11:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తల్ని కేసులతో ఇబ్బంది పెట్టొచ్చన్నారు. కార్యకర్తలు భయపడొద్దు, పార్టీ అండగా ఉంటుందన్నారు. తాము కేసులు పెట్టి ఉంటే సగం మంది కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారన్నారు. కేసీఆర్ పనితనం తప్ప, పగతనం తెలియని నాయకుడు అన్నారు. అందుకే, కొత్త రాష్ట్రంలో కక్షలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. హౌజింగ్ స్కామ్ లో ఎంతో మంది కాంగ్రెస్ నేతల పేర్లు ఉన్నాయన్నారు. ఒక్కో కాంగ్రెస్ నాయకుడు 40, 50 ఇళ్లను కొట్టేశారని ఆరోపించారు. 

Similar News