కాకులు వాలనీయమని.. గద్దలను ఎత్తుకెళ్లారు.. CM రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ కౌంటర్ ఇచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు.. మరీ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుండి వెళ్లినవారేనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రంజిత్ రెడ్డి, కడియం కావ్య, దానం నాగేందర్, సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుండి వెళ్లిన వారేనని గుర్తు చేశారు.
కాకులు వాలనీయను అని.. రేవంత్ రెడ్డి గద్దలను ఎత్తుకెళ్లారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీకి, సీఎం రేవంత్ రెడ్డికి మాటలెక్కువ.. చేతలు తక్కువని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుండి పొయ్యిలో పడ్డేట్లేనని అన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జమ్మికుంటలో పర్యటించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.