KCR అసెంబ్లీకి రాకపోవడానికి కారణం అతడే: CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో

Update: 2024-05-10 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనక మాజీ మంత్రి హరీష్ రావు కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం వల్ల ఒక్క హరీష్ రావుకు మాత్రమే లాభమని అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని, హరీష్ రావు ట్రాప్‌లో పడొద్దని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని చెప్పారు. ఇక, ఎవరైనా తనకు జోలికి వస్తే ఊరుకునే వ్యక్తిని కాదని, ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయిస్తానని అన్నారు. కేసీఆర్‌తో ఎందుకుని గతంలో జానారెడ్డి, జైపాల్ రెడ్డి వదిలేశారు కానీ తాను అలా కాదన్నారు.

నన్ను చెంప మీద వీపు పగులకొడతానని వార్నింగ్ ఇచ్చారు. నాతో పెట్టుకునేటప్పుడే ముందే ఆలోచించుకోవాలని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్‌పైన రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎస్ఐబీ ఆఫీస్‌లో హార్డ్ డిస్క్‌ల మాయంపై తీగలాగితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఈ కేసు విచారణ జరుగుతోందని.. ట్యాపింగ్ కేసు వివరాలు అసెంబ్లీలో బయటపెడతామని క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు మాత్రం తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్‌ చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News