రాహుల్ గాంధీ మీటింగ్ తుస్ మన్నది: కాంగ్రెస్‌ సభపై హరీష్ రావు సెటైర్లు

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-10 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సరూర్‌నగర్‌ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సభకు ఎక్కువమంది హాజరుకాకపోవడం.. హాజరైన జనాలు తిరిగివెళ్లడంతో జనం లేక ఖాళీ కుర్చీలతో సభ బోసిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హరీష్ రావు కాంగ్రెస్ మీటింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది. తులం బంగారం తుస్‌మన్నది. నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తుస్ మన్నది’ అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. నిన్న సరూర్ నగర్ రాహుల్ గాంధీ మీటింగ్లో 30 వేల కుర్చీలు వేసి కూలర్లు పెడితే 3 వేల మంది కూడా రాలేదని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి పోయి లోపలకు రండని బ్రతిమిలాడిన ఎవరూ వస్తలేరన్నారని అన్నారు. రాహుల్ గాంధీకి ఏం చేయాలో అర్థం కాక గంటసేపు బస్సులో కూర్చున్నాడని హరీష్ రావు హేళన చేస్తూ ప్రసంగించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News