మహిళలపై వేధింపులు.. చర్యలకు ఆదేశాలిచ్చినా డోంట్ కేర్!

కలెక్టరేట్ సూర్యాపేట జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వివాదాలకు నిలయంగా మారుతుంది.

Update: 2024-05-23 08:16 GMT

దిశ, సూర్యాపేట : కలెక్టరేట్ సూర్యాపేట జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వివాదాలకు నిలయంగా మారుతుంది. అధికారుల వేధింపులకు తాళలేక మహిళా ఉద్యోగులు ఇటీవల ఫిర్యాదు చేయగా శాఖాపరమైన చర్యలు చేపట్టిన ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను జిల్లా అధికారులు భేఖాతార్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరెండర్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినా ఆ శాఖ అధికారికి ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండటంతో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. సరెండర్ చేయకుండా ఉండేందుకు వెనుక నుండి పెద్ద తలలు ఉన్నారన్న ఆరోపణలు ఉండగా ఇందుకోసం లక్షల్లో చేతులు మరాయన్నది బహిరంగంగా చర్చ జరుగుతోంది.

మహిళలపై వేధింపులు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి మహిళలపై వేధింపులకు గురి చేస్తుండడంతో ఫిబ్రవరి నెలలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఫిర్యాదుపై ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. జిల్లా అదనపు కలెక్టర్ ప్రియాంక నేతృత్వంలో విచారం జరిపి మహిళ ఉద్యోగులపై వేధింపులు వాస్తవమేనని తేల్చారు. వీటితో పాటు గతంలో పని చేసిన డిఆర్డీఏ పిడి ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. ఎంక్వైరీ రిపోర్ట్ ను జిల్లా కలెక్టర్‌కు అందించగా శాఖ పరమైన చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్ సెక్రెటరీకి లేఖ రాశారని సమాచారం.

సరెండర్ చేయాలంటూ ఆదేశాలు?

మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఉద్యోగిపై శాఖ పరమైన చర్యలు చేపట్టింది. హెడ్ ఆఫీస్ కు సరెండర్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కానీ ఆ శాఖ అధికారి ఉత్తర్వులు అందుకొని రోజులు గడుస్తున్నా నేటికి ఆ ఉద్యోగిపై చర్యలు చేపట్టలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సరెండర్ కాకుండా ఉద్యోగి చక్రం తిప్పుతున్నారని ఆ శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. సరెండర్ అడ్డుకుంటు పెద్ద తలలు రంగంలోకి దిగినట్లు సమాచారం.. ఇందుకోసం లక్షల్లో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి..గతంలో చర్యలు చేపట్టకుండా కొంతమంది రాజకీయ నాయకుల వద్ద మోర పెట్టుకున్నట్లు సమాచారం.. ఇకనైనా అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిపై చర్యలు చేపట్టాలంటూ ఆ శాఖ ఉద్యోగులే ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.. ఉద్యోగి పై చర్యలు చేపట్టకపోతే మరోసారి హెడ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేస్తామని తేల్చి చెప్తున్నారు.

వివరణ కోసం సంప్రదిస్తే..

మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఉద్యోగిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సరేండర్ చెయ్యాలని ఉత్తర్వులు జారీ చేశారా అని DRDO పీడీని ఫోన్‌లో సంప్రదించగా ఫోన్‌లో స్పందించలేదు.

Similar News