గ్రూప్ 4 పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ ఎప్పుడంటే?

తెలంగాణలో వరసుగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్3, గ్రూప్4కు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన విషయం

Update: 2023-02-02 09:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  గ్రూప్-4 ఉద్యోగాల కోసం పరీక్షల తేదీని టీఎస్పీఎస్సీ గురువారం ప్రకటించింది. జులై 1వ తేదీన గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 నిర్వహించనున్నట్లు పేర్కొంది. 8,180 పోస్టుల భర్తీకి గ్రూప్-4 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేయగా ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలతో గ్రూప్-4 దరఖాస్తులకు గడువు ముగియనుంది.

Tags:    

Similar News