కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ మిగలరు: తీన్మార్ మల్లన్న

Update: 2024-05-24 12:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాజీనామా చేసిన స్థానానికి మళ్లీ పోటీ చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ విద్యార్థులను కేటీఆర్ ఘోరంగా అవమానించారని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని గ్రాడ్యుయేట్స్‌ను రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. గ్రాడ్యుయేట్, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీలో కల్వకుంట్ల కుటుంబం తప్పా ఎవరూ మిగలరు అని అన్నారు. అంతేకాదు.. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్‌తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు జైలుకు పోవడం ఖాయమని చెప్పారు.

Tags:    

Similar News