తీన్మార్ మల్లన్నకు గుడ్ న్యూస్.. మద్దతు ప్రకటించిన మరో సంఘం

వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ఇస్తునట్టు వికలాంగుల సంక్షేమం కార్పొరేషన్ చైర్మన్

Update: 2024-05-25 16:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ఇస్తునట్టు వికలాంగుల సంక్షేమం కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మెన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. శనివారం గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే వికలాంగులకి కోర్టు ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ కల్పించిందన్నారు. ఎప్పుడైనా అప్లై చేసుకునే విధంగా సదరం స్లాట్, పారా క్రీడల్లో ప్రత్యేక వింగ్‌తో పాటు 40 ఏండ్లు కార్పొరేషన్ చరిత్రలో 100 రోజుల్లోనే వికలాంగుల సంక్షేమం, ఆర్థికంగా సహకారం అందించడం కొరకు కార్పొరేషన్ చైర్మన్ మొదటి సారి నియమించడం జరిగిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోనే వికలాంగ సోదరి రజనికి ఉద్యోగం ఇచ్చి కాంగ్రెస్ క్యాబినేట్ వికలాంగులకు ఆత్మ బంధువు అయిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 130కి పైగా వికలాంగుల సంఘాల జేఏసీ, పట్టభద్రుల వికలాంగుల సంఘాలు, పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నకి సంపూర్ణ మద్దతు ప్రకటించాయని తెలిపారు. అలానే ఏడు దశాబ్దాల పెరిక కుల కలని 100 రోజుల్లోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు. పట్టభద్రుల వికలాంగుల ఓట్లు 100కు 98 శాతానికి పైనా, పెరిక కుల పట్టభద్రుల ఓట్లు 100కు 80 శాతానికి పైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News