రేవంత్ అనేటోడు ఆత్మహత్య చేసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలను హామీలుగా ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-05-09 13:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలను హామీలుగా ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో మాహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అందిస్తుంది. అలాగే రీసెంట్‌గా గృహజ్యోతి స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. మిగతా హామీలు అమలులోకి తీసుకొచ్చేసరికి కొంత సమయం పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నా.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తాజాగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మాట్లాడిన వీడియో రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అది చూస్తే రేవంత్ అనేటోడు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడమంటే ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలని చాలమను చిత్తుచిత్తుగా ఓడించాలని మాజీ ఎమ్మెల్యే కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More...

BREAKING: మత చిచ్చు పెట్టాలనుకుంటున్న బీజేపీని తరమికొట్టండి: సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ 

Similar News