కేటీఆర్‌తో భేటీ.. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక నిర్ణయం

బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-01-04 13:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా పనిచేశానన్నారు. ఈ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉందని, ఈసారి గతం కంటే ఎక్కవ లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News