తెలంగాణను ఏపీలో కలపాలనే వారి కల నిజం కాదు: MLA

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-25 09:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యానికి బోనస్ ఇవ్వలేకనే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. యూటీ, ఉమ్మడి రాజధాని అంటూ కొందరు పిచ్చి కలలు కంటున్నారని అన్నారు. తెలంగాణను ఏపీలో కలపాలన్న కలలు నిజం కావు అని అన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఘనత కేసీఆర్‌ది అన్నారు. రాష్ట్రంలో ఐదు నెలలు అధికారంలో ఉండి విద్యుత్ నిర్వహణను ఆగం చేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని దాటవేస్తున్నారు. రైతు పండించిన పంటకు బోనస్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓటు వేస్తున్నామంటే మన గొంతును అభ్యర్థికి ఇస్తున్నట్లేనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతు ప్రశంసించే గొంతుగా మారిందని, అందుకే ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News