మేడారం భక్తులకు బిగ్ ​అలర్ట్.. జాతరలో బెల్లం కొనాలంటే కచ్చితంగా అది ఉండాల్సిందే..!

మేడారం వెళ్లే భక్తులకు ఎక్సయిజ్​శాఖ బిగ్​అలర్ట్​జారీ చేసింది. వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారం సమర్పించాలనుకునే అందరూ

Update: 2024-02-05 15:49 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మేడారం వెళ్లే భక్తులకు ఎక్సయిజ్​ శాఖ బిగ్ ​అలర్ట్​ జారీ చేసింది. వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారం సమర్పించాలనుకునే అందరూ తప్పనిసరిగా తమ ఆధార్​ కార్డు వివరాలను బెల్లం విక్రయించే వ్యాపారులకు అందచేయాలని సూచించింది. ఇక, భక్తుల నుంచి ఆధార్ వివరాలను తప్పనిసరిగా సేకరించాలని వ్యాపారులను కూడా ఆదేశించింది. ఆధార్ కార్డు నెంబర్, మొబైల్​ నెంబర్‌తో పాటు ఇంటి చిరునామాను కూడా తీసుకోవాలని పేర్కొంది. గుడుంబా తయారీ కోసం బెల్లం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ నిబంధనలను అమల్లోకి తీసుకు వచ్చినట్టు తెలిపింది. ఎవరైనా గుడుంబా తయారీ కోసం బెల్లం విక్రయిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

Tags:    

Similar News