సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల సంచలన వ్యాఖ్యలు

నాలుగు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక హామీలు ప్రజలకు ఇచ్చారనీ, అమలు చేశారా..? అని మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

Update: 2024-05-01 08:01 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: నాలుగు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక హామీలు ప్రజలకు ఇచ్చారనీ, అమలు చేశారా..? అని మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ప్రతీ మహిళకు నెలకు 2, 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకూ జరగలేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. వికలాంగులకు రూ. 6000 ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షలు రుణం ఇస్తామన్నారు. కూలీలకు, ఆటో కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు. వీటిలో ఏదీ నెరవేర్చలేదు. మరీ అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మళ్లీ ఎలా వేస్తారు. ప్రధాని మోదీ కరోనా కాలంలో పేదలు ఆకలితో అలమటించకూడదని ప్రతీ ఇంటికీ నెలకు మనిషికి ఐదు కిలోల చొప్పున ఇచ్చారు.

ఇప్పటికీ కూడా ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లు రెండు డోసులు దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇప్పించిన వ్యక్తి నరేంద్రమోదీ. పేదల ఇళ్లలో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు చాలా ఇబ్బందులు పడేవారు. ప్రధాని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 12 కోట్ల టాయిలెట్లు కట్టించారు. జన్ ధన్ ద్వారా 50 కోట్ల మంది పేదలకు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారు. చిన్న వ్యాపారస్తులు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం కల్పించారు ప్రధాని మోదీ. 2 లక్షల 50 వేల ఇళ్లు ప్రధాని మోదీ పేదలకు కట్టించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వరకు వైద్యసదుపాయం కల్పించారు. ప్రమాదవశాత్తూ చనిపోతే 4 లక్షలు, ఆరోగ్య సమస్యలతో చనిపోతే 2 లక్షల ఇన్సురెన్స్ కల్పించారు.

దశాబ్దాలుగా కోర్టులో నానుతున్న అయోధ్య రామాలయాన్ని ప్రపంచ స్థాయిలో గొప్పగా కట్టించింది ప్రధాని మోదీనే. దేశంలో శాంతి భద్రతలు ఉండాలంటే, ఆర్థికంగా దేశం పటిష్టంగా ఉండాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, బీజేపీని గెలిపించాలని ప్రార్థన. రాజకీయ నాయకునిగా నేను మీకు 23 ఏళ్లుగా తెలుసు. కరోనా కాలంలో ఆరోగ్యమంత్రిగా ఎలా సేవ చేసానో మీకు తెలుసు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు సన్నబియ్యం పెట్టించడానికి ఎంతగానో కృషి చేశాను. మల్కాజ్‌గిరిలో నన్ను ఎంపీగా, నరేంద్రమోదీ గారిని ప్రధానిగా గెలిపించాలని అందరినీ కోరుతున్నాను. అంటూ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News