రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా.. కానీ అంతా ఉత్తిదే: ఈటల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-05-23 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. సర్వేలను తలదన్నేలా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఆరు నెలల్లోనే ప్రజల చేత ఛీ కొట్టించుకోలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా.. కానీ అంతా ఉత్తిదే అని తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఒక్క స్కామ్ ఆరోపణ కూడా రాలేదని అన్నారు. 2014, 2019లో ఒక్క హామీ ఇవ్వకుండానే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు కచ్చితంగా వస్తాయని స్వయంగా ప్రజలే అంటున్నారని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నాణానికి బొమ్మా, బొరుసు లాంటి వారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు.

Tags:    

Similar News