Election Commission: రేపే పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్.. సిరా గుర్తుపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రేపు ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

Update: 2024-05-26 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రేపు ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ మేరకు మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఏడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు అలాగే ఉంది. అయితే, ఈ క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక్లలో ఎడమ చేయి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని ఈసీ పోలింగ్ సిబ్బందికి సూచించింది. బ్యాలెట్ పత్రాలపై ఉండే అభ్యర్థులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా నిన్నటితో ఈ ఎన్నికల ప్రచార సమయం ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అందుకు సంబంధించి జూన్ 5న కౌంటింగ్ ప్రక్రియ ఉండనుంది.

Tags:    

Similar News