‘కవితకు ఈడీ నోటీసులు కక్షసాధింపు చర్యే’

తమ పార్టీ ఎమ్మెల్సీ కవిత‌ను ఈడీ విచారణకు రావాలని ఆదేశించడం కక్ష సాధింపు చర్య అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

Update: 2023-03-08 12:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తమ పార్టీ ఎమ్మెల్సీ కవిత‌ను ఈడీ విచారణకు రావాలని ఆదేశించడం కక్ష సాధింపు చర్య అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా బలపడకుండా అడ్డుకునేందుకే బీజేపీ అడ్డదారి ప్రయత్నాలు చేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థలను అడ్డగోలుగా కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై ఉసిగొల్పుతూ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కేందుకు ఈడీ, సీబీఐలను కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్నదని తెలిపారు. ఇదే ఈడీ, సీబీఐలు ఏదో ఒక రోజు అధికార బీజేపీ నాయకుల మెడకు చుట్టుకోవడం ఖాయమన్నారు. పార్లమెంట్‌లో ఆదానీ వ్యవహారంపై నిగ్గదీసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సమాధానం చెప్పలేదన్నారు. ఈ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థలు ఎందుకు విచారణ చేయడం లేదన్నారు..!? కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉండే, జాతీయ దర్యాప్తు సంస్థలను ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయటం ప్రజాస్వామ్యానికి చేటన్నారు. అధికార బీజేపీకి గుణపాఠం నేర్పేందుకు, దేశ ప్రజలంతా సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. 

ఇవి కూడా చదవండి Delhi Liquor Scam : బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీకి బయలుదేరిన కవిత

Tags:    

Similar News