బతుకమ్మ చీలను ఎలా వాడుతున్నారో తెలుసా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

Update: 2022-10-03 09:13 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న ఈ చీరల వల్ల మహిళలకు ఆనందమే కాకుండా.. నేతన్నలకు ఉపాధి లభిస్తోంది. అయితే, దీనిపై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోదంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ చీరలను టబ్బులను కొనడానికి, పొలం పనులకు ఉపయోగించడానికి వాటడం గమనార్హం. ప్రభుత్వం రూ.330 కోట్లు ఖర్చు చేసి ఇలాంటి చీరలా? పంపిణీ చేసేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News