KCR నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు.. డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

పదేళ్లు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2024-04-30 08:01 GMT

దిశ కూసుమంచి: పదేళ్లు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కూసుమంచి మండల కేంద్రంలో ని బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరితో రోడ్డు షో లో బట్టి పాల్గొని మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయని కేసిఆర్ ఈ రోజు మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ అధికారంలో రాగానే ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, రూ. 500 కె గ్యాస్ పథకాలు అమలు చేసామని అన్నారు. రైతులపైన కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందని,తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రైతులకు ఇన్సూరెన్స్ కట్టించామని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల మెస్ బిల్లులు కట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కు మొదటి తారీకునే జీతాలు ఇస్తున్నమన్నారు. సిగ్గులేకుండా కరెంటు పోతుందని మాజీ ముఖ్యమంత్రి తన స్థాయిని మర్చిపోయి అబద్దాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నరన్నారు. సీతా రామచంద్రస్వామి సన్నిధిలో పేదలకు ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు వేలు ఇళ్ళు ఇస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ దేశ సంపదను వారికి అనుకూలంగా ఉన్న వారికి దోచిపెడుతున్నారని, బీఆర్ఎస్ బీజేపీ చేతులు కలిపి దేశాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మీరందరూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం: పొంగులేటి

ప్రతి గ్రామంలో అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు,పెన్షన్ ప్రతి పేదవానికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో పది సంవత్సరాలు పాలించిన ఓ పెద్దాయన కర్ర పట్టుకొని మళ్ళీ మాయ మాటలు చెప్తూ మళ్లీ మన మధ్యకు వస్తున్నారని , ఒకసారి కర్ర కాల్చి వాత పెట్టాం మళ్లీ ఆ పార్టీ బీజేపీ పార్టీకి బీ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బొంద పెట్టాల్సిన అవసరం ఉందని విమర్శించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు రావాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కొన్నింటిని పూర్తి చేశామన్నారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యడం కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఐదేండ్లు అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేస్తుంది: రఘురామ్ రెడ్డి

తమకు ఐదేండ్లు అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేస్తుందని ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు ముగ్గురు పవర్ ఫుల్ మంత్రులు ఉన్నారని, కాంగ్రెస్ 150 రోజుల్లో ఆరు గ్యారెంటీ ల్లో ఐదు గ్యారెంటీ లు అమలు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పెయిల్ ఐయింది. ఇప్పుడు కేసీఆర్ వచ్చి కరెంటు లేదని ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ ప్రభుత్వం అంబానీ, ఆదానీకి ఆస్తులను ధారాదత్తం చేసిందని విమర్శించారు. తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, రాయ నాగేశ్వరరావు, జిల్లా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, మండల అధ్యక్షుడు మట్టె గురవయ్య, సీనియర్ నాయకులు మహమ్మద్ హఫీజ్ ఉద్దీన్, కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, బజ్జూరు వెంకటరెడ్డి, ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News