Delhi Liquor Scam Case: కవిత పిటిషన్‌పై నేడు విచారణ.. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేనా?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Update: 2024-05-24 05:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెండ్ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నారు. అంతుకు ముందు రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో కవిత బెయిల్ కోసం మళ్లీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 9న ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. 10న ఈడీ కేసులో 16న సీబీఐ కేసుల్లో కవిత పిటిషన్లపై జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ బెంచ్‌ విచారణ జరిపింది. PMLA సెక్షన్‌-19 ప్రకారం.. కవిత అరెస్ట్‌ అక్రమమని, రూ.100 కోట్లు చెల్లించినట్లుగా ఎక్కడా ఆధారాలు కూడా లేవని ఆమె తరపు లాయర్‌ కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఈ మేరకు కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.  

Tags:    

Similar News