DCP అసభ్యంగా ప్రవర్తించాడు.. డింపుల్ అడ్వొకేట్ సంచలన ఆరోపణలు

హీరోయిన్ డింపుల్‌కు ప్రాణహాని ఉందని ఆమె అడ్వొకేట్ డేవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-05-25 08:26 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే.. టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ మధ్య తలెత్తిన వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డింపుల్ తరపు న్యాయవాది డేవిడ్ పాల్ తన క్లయింట్‌కు ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యానించారు. వివాదం తలెత్తినప్పటి నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డింపుల్‌కు ఫోన్లు వస్తున్నట్టు చెప్పారు. దాంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిందన్నారు.

నిజానికి ఐపీఎస్ అధికారి రాహుల్ తన క్లయింట్ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టు ఆరోపించారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండటానికే డింపుల్ పై తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన డ్రైవర్ చేతన్ కాకుండా డీసీపీ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. డింపుల్‌పై జూబ్లీహిల్స్ స్టేషన్లో నమోదైన కేసు ఎఫ్ఐఆర్ తమకు అందినట్టు చెప్పారు. అందులో ఐపీఎస్ రాహుల్ కారు కవర్‌ను తొలగించినట్టుగా ఉందన్నారు.

Tags:    

Similar News