బ్రేకింగ్: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ గూటికి కీలక నేత

అధికార బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.

Update: 2023-03-26 05:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్, మాజీ మంత్రి దర్మపురి శ్రీనివాస్ (డీఎస్) లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే ఆయనకు కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వీ.హనుమంతరావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ ఆలీ తదితర పలువురు డీఎస్‌కు స్వాగతం పలికారు.

రాహుల్‌గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన తర్వాత తన పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చానని తొలుత పేర్కొన్న డీఎస్ చివరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి చేతుల మీదుగా తాను కూడా పార్టీలో చేరారు. సొంత ఇంటికి చేరుకున్నదానికంటే సంతోషంగా ఉందని డీఎస్ వ్యాఖ్యానించారు.

తొలుత తన కుమారుడు చేరుతున్నారని, తాను మాత్రం చేరడం లేదని డీఎస్ పేర్కొన్నప్పటికీ చివరకు దీక్షలో కూర్చోడానికి వెళ్ళేముందు లాంఛనంగా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ తన కుటుంబ పార్టీ అని, తనను చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని, ఎప్పుడైనా తాను కాంగ్రెస్ మనిషినేననంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే చేరిక ప్రక్రియ ముగిసింది.

Tags:    

Similar News