HYD: ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని మొయినాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో కానిస్టేబుల్ పనిచేస్తున్న రాజేశ్ అనే వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Update: 2023-11-24 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని మొయినాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో కానిస్టేబుల్ పనిచేస్తున్న రాకేశ్ అనే వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. బంధువుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య కారణాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం రాకేశ్ దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News