సీఎం కేసీఆర్​ కుటుంబం అంతా క్రైమే: TPCC ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫైర్

కేసీఆర్ పీఠం కదులుందని, ఇక ఆయన మోసాలను నమ్మే ప్రసక్తి లేదని టీపీసీసీ సీనియర్ ​ఉపాధ్యక్షులు నిరంజన్ ​పేర్కొన్నారు.

Update: 2023-03-21 15:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ పీఠం కదులుందని, ఇక ఆయన మోసాలను నమ్మే ప్రసక్తి లేదని టీపీసీసీ సీనియర్ ​ఉపాధ్యక్షులు నిరంజన్ ​పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. మద్యం కుంభకోణంలో కూతురు కవిత, పేపర్​ లీకేజీలో కేటీఆర్​ ఇరుక్కొని తెలంగాణ పరువు తీశారన్నారు. కుటుంబ అంతా క్రైమ్ ​చేస్తుందన్నారు. కేసీఆర్‌ను నమ్ముకున్న తెలంగాణ ప్రజలు మోసపోతూనే ఉన్నారన్నారు. ఇప్పటికైన ప్రజలను గ్రహించాలని కోరారు. ఇక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

టీఎస్పీస్సీ పేపర్ లీకేజీ‌పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతరాహిత్యం అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో సర్కార్ చెలగాటం ఆడుతోందన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలోనూ 42 ఉద్యోగాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్ముకున్నట్లు ఆరోపించారు. ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల విషయంలో మంత్రి వ్యాఖ్యలు సరికాదన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి భూములు కబ్జాలు చేయడం, ఉద్యోగాలు అమ్ముకోవడం తప్పా, నిరుద్యోగుల సమస్యలు పట్టవన్నారు. మంత్రి ఐకే రెడ్డి వెంటనే నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News