ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్​చేయాలి: జడ్సన్

మహిళా సర్పంచ్‌పై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులు పాల్పడినందున అతని ఎమ్ఎల్ఏ పదవి నుండి అన్హారునిగా ప్రకటించాలని గవర్నకు ఫిర్యాదు అందింది.

Update: 2023-03-10 15:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా సర్పంచ్‌పై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులు పాల్పడినందున అతని ఎమ్ఎల్ఏ పదవి నుండి అన్హారునిగా ప్రకటించాలని గవర్నకు ఫిర్యాదు అందింది. నిత్యం మహిళలను వేదిస్తున్న రాజయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని జడ్సన్​శుక్రవారం గవర్నర్​తమిళి సైకు కంప్లైంట్​ చేశారు.

ఈ సందర్భంగా జడ్సన్​ మాట్లాడుతూ.. స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఓ లేడీ సర్పంచ్‌పై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్‌ నాయకురాలితో రాయబారం చేయించడం దారుణమన్నారు. ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చిన మహిళలపై వేదింపులు సరికదన్నారు. వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యే పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని జడ్సన్​ డిమాండ్​ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News