సన్నాలకే డిమాండ్ ఎక్కువ.. అందుకే రూ.500 బోనస్: అన్వేష్​రెడ్డి

సన్నాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, అందుకే రైతులకు బోనస్ ఇచ్చి ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్

Update: 2024-05-22 14:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సన్నాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, అందుకే రైతులకు బోనస్ ఇచ్చి ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పీడీఎస్ పంపిణీకి సన్నాలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామన్నారు. రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతుందన్నారు. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు. సన్నాలు, దొడ్డు ఓట్లు ఎంత పండిస్తారో? అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

ఈ ఏడాది 14 లక్షల ఎకరాల్లో సన్నాలు పండిస్తుండగా, 32 లక్షల ఎకరాల్లో దొడ్లు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. రైతులను ఆదుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం సన్నాలకు, దొడ్డు వడ్లకు ఒకే ధర ఇస్తుందన్నారు. సన్నాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నందునే మిల్లర్లు కూడా అదనపు ధరతో కొనుగోలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఆ రేషన్ బియ్యం మిల్లర్ల వద్ద రీసైక్లింగ్ అవుతుందన్నారు. పీడీఎస్ ద్వారా సన్నాలు పంపిణీ చేయాలంటే సన్న వడ్ల పంట అవసరం ఉంటుందన్నారు. అయితే దొడ్డు వడ్లు పండించే రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

Similar News