కాంగ్రెస్ హత్యా రాజకీయాలు.. BRS సంచలన ట్వీట్

రాష్ట్రంలో సంచలన సృష్టించిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై గులాబీ పార్టీ స్పందించింది.

Update: 2024-05-23 04:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలన సృష్టించిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై గులాబీ పార్టీ స్పందించింది. బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి హత్యపై ట్విట్టర్ వేదికగా కారు పార్టీ స్పందించింది. తెలంగాణలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక హత్యా రాజకీయాలను కాంగ్రెస్ స్టార్ట్ చేసిందని మండిపడింది. బీఆర్ఎస్ నాయకులపై.. కాంగ్రెస్ నాయకులు వరుసగా అరాచకాలు, దాడులు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ హత్యా రాజకీయాలు ఆపకపోతే ప్రజలే మీకు సరైన గుణపాఠం చెబుతారు.. మంత్రి జూపల్లి కబడ్దార్ అంటూ హెచ్చరించింది.

Similar News