ఎల్ఆర్ఎస్‌పై కాంగ్రెస్ నిర్ణయం.. హరీష్ రావు సంచలన ట్వీట్

ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

Update: 2024-02-27 08:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)పై తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పింది. ఎల్ ఆర్ ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్దమైంది. నో ఎల్.ఆర్.ఎస్ - నో బీ.ఆర్.ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్ఆర్‌ఎస్‌కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనం. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలి. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

Similar News