మాజీ గవర్నర్ పై ఈసీకి ఫిర్యాదు..!

మాజీ గవర్నర్ తమిళి సై సౌందరాజన్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను బీఆర్ఎస్ కోరింది.

Update: 2024-05-08 14:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ గవర్నర్ తమిళి సై సౌందరాజన్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను బీఆర్ఎస్ కోరింది. బుధవారం ఈసీకి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కాలనీ లో తమిళిసై ఎన్నికల ప్రచారం చేశారని, ఆ సమయంలో ఓటర్లకు అయోధ్య రామమందిర నమూనాలను పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని(మోడల్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘించడమేనని అన్నారు. ఆమెపై ఆర్టికల్ 324 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చూడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. రామమందిర నమూనాలను పంపిణీ చేస్తున్న ఫొటోలను ఈసీకి అందజేసినట్లు తెలిపారు. అదే విధంగా తమిళిసై పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లోనూ బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ టీం సభ్యులు లలిత, ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్ గంగా, సదానందం, కార్తీక్ పాల్గొన్నారు.

 

Similar News