శ్రమైక జీవన సౌందర్యం అదే.. మేడే రోజున CM రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్

మేడే పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి స్పెషల్ విషెస్ తెలిపారు.

Update: 2024-05-01 03:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మేడే పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి స్పెషల్ విషెస్ తెలిపారు. ‘చెమట చుక్క.. కరిగిన కండరం.. శ్రమైక జీవన సౌందర్యం.. సకల తెలంగాణ ఆహార్యం.. మేడే సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు.’ అని ట్వీట్ చేవారు. ఈ ట్వీట్‌కు ఖాకీ చొక్కా వేసుకుని కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉన్న ఫొటో, మేడే 2024 హ్యాష్ ట్యాగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జత చేశారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు అని.. కార్మికుల సంక్షేమమే తమ ప్రాధాన్యత అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానం.. కార్మికుల అభ్యున్నతికి దోహదపడుతుందని మేడే సందేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. 


Similar News