కేటీఆర్ ఉడతలు పట్టేవాడు, తెలంగాణలో అతడు నథింగ్: CM రేవంత్ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్య్వూలో

Update: 2024-05-10 03:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ఉడతలు పట్టేవాడని, అసలు అతడి గురించి ఎందుకు సీరియస్‌గా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పాలిటిక్స్‌లో కేటీఆర్ అనే వాడు నథింగ్ అని టిష్యూ పేపర్‌తో సమానమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అయితే తన ప్రత్యర్థి బీఆర్ఎస్, కేసీఆరేనని స్పష్టం చేశారు. ఆయన ఉన్నంత కాలం వీళ్లకు ఎవరికి అవకాశం ఇవ్వడని అనుకుంటున్నానని అన్నారు. ఫ్యూచర్‌లో బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్, హరీష్ రావు ఎవరూ లీడ్ చేస్తారా అనేది వాళ్ల ఫ్యామిలీనే డిసైడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.

ఇక, తెలంగాణ పవర్ కట్స్‌పైన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎలాంటి విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. హరీష్ రావు లాంటి వాళ్లు కొంతమంది లైన్ మైన్లను మ్యానేజ్ చేసి కరెంట్ ఆఫ్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దాని కన్నా 40 శాతం ఎక్కువ విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ కోతలపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చపెడతామని, విద్యుత్‌పై హరీష్ రావు, జగదీష్ రెడ్డితో చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News