పూర్తి స్థాయిలో కాకున్నా.. పనిలో కొంత ధ్యానంగా ఉంటా.. CM రేవంత్ రెడ్డి

బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-23 08:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్ వేడుకల్లో గురువారం సీఎం పాల్గొన్నారు. బౌద్ధ బిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ధ్యానం ఒక పనిగా కాదు.. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్నారు. చదివితే రెండు లైన్ల మాదిరిగా ఉందని.. అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అందులోనే ఉందని తెలిపారు.

తాను పూర్తి స్థాయిలో కాకున్నా.. పనిలో కొంతమేరకైనా ధ్యానంగా ఉంటా అన్నారు. మహాబోధి బుద్ధవిహార్‌కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ప్రతిపాదనలు పంపితే కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామన్నారు. సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సి బాధ్యత అందరిదని స్పష్టం చేశారు. మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవాలని సూచించారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచాలన్నారు. గౌతమ బుద్ధుడు బోధించిన సందేశం అందరికీ అవసరం అన్నారు.

Similar News