సీఎం కేసీఆర్ సభ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే గృహ నిర్బంధం!

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పదే పదే పోలీసులు అడ్డుకుంటే ప్రజా సమస్యలు తీరుతాయా అని ప్రశ్నించారు.

Update: 2022-08-29 13:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పదే పదే పోలీసులు అడ్డుకుంటే ప్రజా సమస్యలు తీరుతాయా అని ప్రశ్నించారు. సోమవారం సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు ఆయన్ను గృహనిర్భంధం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన 'మంథని నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ సీఎంను కలవాలని, నా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించాలని అనుకున్నాను కానీ, పోలీసులు నన్ను ఇంట్లోకి లాక్కెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజలచే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో నన్ను తిరగనీయకుండా ఇలా అడ్డుకోవడం సబబేనా అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈ పిరికిపంద చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది' అని మండిపడ్డారు. కాగా సీఎం జిల్లా పర్యటన సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు నాయకులను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. మరి కొందరిని అరెస్టులు చేశారు.

KCR సభలో కలకలం.. నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం

Tags:    

Similar News