ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మరోసారి KCR సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మరోసారి స్పందించారు.

Update: 2022-12-04 12:05 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూశారని అన్నారు. వాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని జైళ్లో పెట్టించామని అన్నారు. అత్యంత నియంతృత్వంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దేశంలో ఎక్కడో ఒకచోట బీజేపీ ప్రజా వ్యతిరేక పోకడలకు వ్యతరేకంగా యుద్ధం ప్రారంభం కావాలని, ఆ యుద్ధం మనమే ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. దాడుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధే తమ లక్ష్యం అని, అభివృద్ధి చేసి చూపించామని అన్నారు.

Tags:    

Similar News