ప్రజలను మోసం చేయడం వైయస్ఆర్ బిడ్డ షర్మిల రక్తంలో లేదు

తెలంగాణాలో కేసీఆర్ నియంత పాలనను అంతం చేయడానికే తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేశామే తప్ప, మోసం కాదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Update: 2023-11-07 15:05 GMT

దిశ , తెలంగాణ బ్యూరో : తెలంగాణాలో కేసీఆర్ నియంత పాలనను అంతం చేయడానికే తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేశామే తప్ప, మోసం కాదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోసం చేయడం వైయస్ఆర్ బిడ్డ షర్మిల రక్తంలో లేదని ఆ అవసరం కూడా తనకు లేదన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మన పోరాటం ఆగదని చెప్పారు.

తెలంగాణ ప్రజలను కేసీఆర్ వాగ్ధానాలు ఇచ్చి మోసం చేస్తున్నాడు కాబట్టి వైఎస్ఆర్ టీపీని స్థాపించడం జరిగిందని తెలిపారు. కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ఎన్నో నిరాహార దీక్షలు, ధర్నాలు చేశామని తెలిపారు. 3800km పాదయాత్ర చేసి ప్రజలకు కేసీఆర్ మోసాలను వివరించడమే కాకుండా ప్రజల కష్టాలను, ఇబ్బందులను తెలుసుకోవడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. ఇన్ని కార్యక్రమాలు కేసీఆర్ నియంత పాలనను అంతం చేయడానికేనని తెలిపారు.

ఈ ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించే అవకాశం వచ్చిందని . అది మనకు కాకుండా మరో పార్టీకి ఆ అవకాశం వచ్చిందని, అలాంటప్పుడు మనం ఆ పార్టీని బలోపేతం చేద్దామా..? లేక మనం పోటీకి దిగి ఓట్లు చీల్చి మళ్ళీ కేసీఆర్‌ను గద్దెనెక్కిద్ధమా..? అని ఆమె ప్రశ్నించారు. మనకు స్వార్ధ రాజకీయాలే ముఖ్యమా..? తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమా..? ఆలోచించాలని కోరారు. ఇన్నాళ్లు నాతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ప్రజల కోసం త్యాగం చేసాం తప్పా, ఇది మోసం కాదు. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైఫల్యాలను ఎండగడుతూనే వుంటూ.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. మనం రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసం కాదు. ప్రజల పక్షాన నిలబడటం కోసమని తెలిపారు. ఇది గ్రహించి నాతో ఉన్నవాళ్లే నా వాళ్ళు.. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరేవారని. నేను నిలబడతా.. మిమ్మల్ని నిలబెడతనని ఆమె అన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News