జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలు తీసేంత పని చేసిన చంద్రబాబు: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

స్వార్థం కోసం ఎంత పనైనా చేసేందుకు వెనుకాడని మనిషి చంద్రబాబు అని, ఒకవేళ ఆయనే గెలిస్తే పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌ను గెంటేయ్యడం ఖాయమని ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-06 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: డ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితేనే టీడీపీ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ వశం అవుతుందని అన్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు గెలుపు కోసం అహర్నిషలు కష్టపడ్డాడని గుర్తు చేశారు. రాష్ట్రం అంతటా పర్యటిస్తుండగా యాక్సిడెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు తుప్పు అని ఆయన కొడుకు లోకేష్ పప్పు అని.. ఆతడికి వర్ధంతికి, జయంతికి తేడా కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News