‘దమ్ముంటే ప్రూవ్ చేయు’.. MLA మహేశ్వర్ రెడ్డికి చామల సవాల్

బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఢిల్లీ లాబీయిస్టు అంటూ భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-05-24 15:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఢిల్లీ లాబీయిస్టు అంటూ భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో సీనియర్ నేతలు ఉన్నా, ఢిల్లీలో లాబీయింగ్ చేసుకొని ఎల్పీ నేతగా హోదా తెచ్చుకున్నాడని ఆరోపిస్తూ ఆయన శుక్రవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. టాక్స్‌లపై దమ్ముంటే ప్రూవ్ చేయాలన్నారు. అర్ధరహిత ఆరోపణలు తగదన్నారు. అడ్దదిడ్డంగా మాట్లాడితే పార్టీ కార్యకర్తలు నిలదీసుడు ఖాయమన్నారు.

జాతీయ నాయకత్వాన్ని ఆకర్షించాలనే సంకల్పం ఉంటే, ఈ తరహాలో మాట్లాడితే నష్టపోతారని విమర్శించారు. ప్రతిపక్ష హోదాలను సంపూర్ణంగా వ్యహరించాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని, గత పదేళ్లలో అస్తవ్యస్తంగా మారిన ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖను సమర్ధవంతంగా గాడిన పెట్టేందుకు కష్టపడుతున్నారన్నారు. అలాంటి నేతను మహేశ్వర్ రెడ్డి విమర్శించడం సిగ్గు చేటన్నారు.

ఇక 2014, 2018 మేనిఫెస్టోలను కూడా బీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని చురకలు అంటించారు. మాజీ మంత్రి హరీష్​రావుకు ప్రతిపక్ష హోదాలో హుందాగా వ్యవహరిస్తే బెటర్ అంటూ సూచించారు. ఎమ్మెల్యే కాకున్నా హరీష్ రావును మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లోనే ఎన్నో హామీలను నెరవేర్చిందన్నారు. తాము చెప్పిన హామీలన్నీ సంపూర్ణంగా నెరవేర్చుతామన్నారు. కానీ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు బీఆర్ఎస్ చొరవ చూపుతుందన్నారు. ఇది సమాజానికి మంచిది కాదన్నారు.

Similar News