పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్‌కు నిద్రలో కూడా ట్యాక్స్‌లే గుర్తొస్తున్నాయి: అద్దంకి దయాకర్

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా BRU (B- భట్టి, R-రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ,U-ఉత్తమ్) ట్యాక్స్ ను అనధికారికంగా వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

Update: 2024-05-26 03:44 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా BRU (B- భట్టి, R-రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ,U-ఉత్తమ్) ట్యాక్స్ ను అనధికారికంగా వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అలాగే పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకులు.. రక్తం మరిగిన పులుల్లా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకొవడానికి ప్లాన్ చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీలో ఎవరి దుకాణం వారిదే అని.. అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతన్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుందని.. ఈ క్రమంలోనే నిద్రలో కూడా బీఆర్ఎస్ నాయకులకు ట్యాక్స్ లే గుర్తోస్తున్నాయని సెటైర్లు వేశారు. ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని.. తమకు దోచుకునే అవకాశం పోయిందన్న అక్కసుతోనే.. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Similar News