BRS నేత హత్య.. హరీష్ రావు సెన్సేషనల్ ట్వీట్

బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Update: 2024-05-23 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీధర్ రెడ్డి హత్య దారుణమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు హత్యకు గురికావడం, పలుచోట్లు నేతలు, కార్యకర్తలపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావులేదని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. రాజకీయ ప్రేరేపిత హత్యపై తక్షణం విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 

Click Here For Twitter Post..

Tags:    

Similar News