బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్?

తనను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

Update: 2024-05-01 07:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తనను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అయిన మన్నె క్రిశాంక్ కొత్తగూడెంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ లో పాల్గొని తిరిగి వస్తుండగా.. పంతంగి టోల్ ప్లాజా చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తానమని చెప్పి తన వాహానాన్ని పోలీసులు ఆపినట్లు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఉన్నతాధికారులు వస్తున్నారని చెప్పి దాదాపు 30 నిమిషాల నుండి వాహానాన్ని తనిఖీ చేయకుండా రోడ్డుపై నిలబెట్టారని, తనను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మొదట ట్వీట్ చేశారు.

అనంతరం చౌటుప్పల్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ తన కారులో కూర్చొని తన వాహానాన్ని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారని, ఎందుకో తనకు తెలియదని మరో ట్వీట్ చేశారు. కాగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై దుష్ప్రాచారాలు చేస్తున్నారని మన్నె క్రిశాంక్ పై గత నాలుగు నెలల్లో ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత కారణంగా హాస్టల్ విద్యార్ధులకు సెలవులు ప్రకటించారని చేసిన పోస్ట్ కు ఓయూ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు అయ్యింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఓయూ చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ ఫిర్యాదుతో ఓయూ పోలీసులు మన్నె క్రిశాంక్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


Similar News