బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి జడ్పీటీసీ దంపతులు

గద్వాల నియోజకవర్గంలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలనుంది....

Update: 2024-05-10 06:48 GMT

దిశ గద్వాల ప్రతినిధి: గద్వాల నియోజకవర్గంలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగలనుంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ధరూర్ జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.  మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పద్మావెంకటేశ్వర్ రెడ్డి 2014,  2019లో ధరూర్ మండలం జెడ్పీటీసీగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  అనుచరులుగా కొనసాగారు.


ఎమ్మెల్యే ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్నారంటూ తమని దూరం పెట్టిన ప్రతి ఎన్నికల్లో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గెలుపు కోసమే పని చేసామని జడ్పీటీసీ దంపతులు తెలిపారు. 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వెంట ఉంటూ ప్రజలకు నీరంతరం సేవలు చేశామన్నారు. కానీ ఎమ్మెల్యే తమను, తమ అనుచరులను గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ తమను ఎమ్మెల్యే చాలా అవమానాలకు గురి చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి మక్తల్ సభలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతామని జడ్పీటీసీ  పద్మావెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. 

Similar News