జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్.. కేటీఆర్, హరీశ్ రావు అలా తిరగాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Update: 2024-05-23 07:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:పదవి పోయిందని, చెల్లి కవిత జైలుకు పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయని, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్తాపితం కాబోతున్నదన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం రేవంత్ రెడ్డి చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఇండిపెండెంట్ జడ్పీటీసీ గా గెలిచి ప్రజల కోసం పోరాడి ఈ స్థాయికి రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వస్తే తండ్రిని అడ్డం పెట్టుకుని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని ధ్వజమెత్తారు.

ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టిందే కేటీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు మేం ఇచ్చాం అని కేటీఆర్ అంటున్నాడు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే మీరే కదా డిక్టేటర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేక పోయారు కేటీఆర్? అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు పరిశ్రమలు తెచ్చిందే కాంగ్రెస్ అన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశం చేసిందని , కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పులు ఖజానా మాత్రమే ఇచ్చారని అన్నారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామని, దోడ్డు వడ్ల కు ఇవ్వమని మేము ఎక్కడా చెప్పలేదన్నారు. మేమ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయబోతున్నామని భయం పట్టుకుందని, ఎన్నికల తర్వాత పార్టీ ఉండదని తెలిసి బిడ్డ బెయిల్ కోసం ఓపెన్ గా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలిపిదంని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ మాదిరిగా బీఆర్ఎస్ కుప్పకూలడం ఖాయం అని జూన్ 6 తర్వాత ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎలాగూ ఉండరని ఏ కార్యకర్తలు కూడా పార్టీని వదిలేస్తారన్నారు.

కొత్త దుకాణం ఆలోచనలో హరీశ్ రావు :

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 12 కుతగ్గకుండా మాకు ఎంపీ సీట్లు వస్తాయని బీఆర్ఎస్ కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ అన్నారు. కేంద్రం ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత కేటీఆర్, హరీశ్ రావు లు ఇలానే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వారి నాయకులే వారిని చెప్పులతో కొడతారని, జూన్ 5 తర్వాత వారు కేఏ పాల్ లా తిరగాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్ ఎల్బీ బాధ్యత కేటీఆర్ కు ఇస్తే హరీశ్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. తీన్మార్ మల్లన్నపై కేసులు ఉన్నాయని విమర్శిస్తూ.. బీజేపీల నుంచి వచ్చిన వ్యక్తిని ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగుడుతున్న కేటీఆర్.. మీ చెల్లిపై 8 వేల పేజీలతో చార్జి షీట్ వేశారని దీన్నేమంటారని నిలదీశారు.

ఐదారు రోజులు ఆలస్యంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం మా ఓటమికి కారణం అని కేటీఆర్ అంటున్నారు. అరేయ్ కేటీఆర్.. 2019 నుండి ఏనాడు ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు వేయలేదని.. కానీ మేము మార్చి, ఏప్రిల్ లో మొదటి తేదీనే వేశామన్నారు. మీ దోపిడిన బయట పెట్టినందుకే తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. మందకృష్ణ మాదిగ మాట్లాడితే ఆయన్ను కూడా జైల్లో పెట్టారు. కవితకు బెయిల్ రాదని తెలిసే కేసీఆర్ బీజేపీకి లొంగిపోయారన్నారు. రేవంత్ రెడ్డికి భయపడి అసెంబ్లీకి రాని కేసీఆర్ కర్రపట్టుకుని తిరుగుతూ బీజేపీకి ఓట్లు వేయించారని ధ్వజమెత్తారు. ధర్నా చౌక్ ఎత్తివేశారు. టెట్ కు రూ.2000 ఫీజు చేశారని అడుగుతున్న కేటీఆర్ కు కొంచెమైన సిగ్గుండాలి.. వైన్స్ షాప్ టెండర్లపై రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ వసూలు చేసింది ఎవరని ప్రశ్నించారు. వచ్చే నెల 6,7 తాను, మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనకు వెళ్తున్నామన్నారు.

ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కౌంటర్:

బీజేపీ ఫోర్ లీడర్ అయి నెల రోజులు కానీ వ్యక్తి ఆర్టీఐ కింద 70 లెటర్ లు పెట్టారని ఏలేటి మహేశ్వర్ రెడ్డిని విమర్శించారు. సీనియర్ నేత రాజాసింగ్ కు కాదని ఏ పైరవీ చేసి ఎల్పీ పదవి తెచ్చుకున్న ఆ వ్యక్తి మాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన పేరు చెప్పాలంటేనే తనకు ఇన్సల్ట్ గా ఉందని అలాంటి వ్యక్తి ఆర్ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ పేరుతో సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మేము వచ్చే మూడు నెలు అయిందని అంతలోనే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు.

Tags:    

Similar News