గుండెపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే టాటూ వేయించుకున్న కార్యకర్త

గుండెపై తన అభిమాన నాయకుడి ఫోటోను పచ్చబొట్టుగా వేయించుకుని అభిమానాన్ని చాటుకున్నాడు కార్యకర్త.

Update: 2023-04-24 04:25 GMT

దిశ, అచ్చంపేట : గుండెపై తన అభిమాన నాయకుడి ఫోటోను పచ్చబొట్టుగా వేయించుకుని అభిమానాన్ని చాటుకున్నాడు కార్యకర్త. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చెందిన బొద్దుల పర్వతాలు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ గువ్వల బాలరాజుకు వీరాభిమాని. అయితే తాజాగా గువ్వల బాలరాజు ఫోటోను తన గుండెపై టాటో వేసుకొని అభిమానాన్ని చాటుకున్నారు. ఇది చూసిన గులాబీ శ్రేణులు కార్యకర్త అభిమానానికి ఫిదా అవుతున్నారు.

Tags:    

Similar News