BREAKING: నేడే సుధీర్ఘ సంపూర్ణ సూర్య గ్రహణం.. ఆ ప్రాంతంలో కమ్ముకోనున్న చీకటి

54 ఏళ్ల తరువాత ఉగాది పండగ ముందురోజు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.

Update: 2024-04-08 02:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: 54 ఏళ్ల తరువాత ఉగాది పండగ ముందురోజు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. 2024 సంవత్సరంలో మొదటిసారి నేడు సుధీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. భారత కాలమానం ప్రకారం.. నేడు రాత్రి 9.12 గంటలకు గ్రహణం ప్రారంభమై వేకువజాము 2.22 గంటలకు వరకు అంటే 4.09 నిమిషాల పాటు కొనసాగుతోందని ఖగోళ శాస్ట్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రహణం ఎఫెక్ట్‌తో ఉత్తర అమెరికా ప్రాంతం అంతా చీకటి కప్పేయనుంది. భారత్‌పై సూర్యగ్రహణ ప్రభావం అంతగా లేదు. సూర్యగ్రహణ విక్షణం చాలా ప్రమాదకరం. గ్రహణం సమయంలో సూర్యుడి నుంచి ఫోకస్ చాలా ఎక్కువగా ఉండటంతో కళ్లు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాగా, సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలకునే వారు నాసా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.12 నుంచి తెల్లవారుజామున 2.22 వరకు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

Tags:    

Similar News