BREAKING: క్వింటాకు రూ.500 ఇచ్చే వరకు రేవంత్ సర్కార్‌ను వదిలిపెట్టేది లేదు: మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్

రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-15 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారని అయినా ప్రభత్వం నుంచి స్పందన లేదని అన్నారు. కొన్నిచోట్ల కొనుగోళ్లు ప్రారంభం అయినా.. తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోనూ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అకాల వర్షాలనికి చాలా చోట్ల కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిచిందని.. రైతులు ఆదుకునే బాధ్యత సర్కార్‌పై ఉండటంతో ఆ ధాన్యాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. అదేవిధంగా క్వింటాకు రూ.500 ఇచ్చే వరకు రేవంత్ సర్కార్‌ను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటికే బీఆర్ఎస్ నాలుగు సార్లు విజయం సాధించని తెలిపారు.

ఈసారి గ్రాడ్యుయేట్లు అంతా తమ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత హామీలు గుర్తు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అని వాగ్ధానం చేసి ఇప్పుడు దాని గురించే మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ పరీక్ష ఫీజు రూ.200 ఉంటే.. నేడు కాంగ్రెస్ సర్కార్ రూ.2 వేలు చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి కల్లబొల్లి మాటలను నిరుద్యోగ యువత నమ్మితే మోసపోతారని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News